News

అధికారులతో గొడవపడిన వైసీపీ ఎమ్మెల్యే


తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ భూసేకరణ సమావేశం రసాభాసగా మారింది. తాము చెప్పిందే రాసుకోవాలంటూ సీఆర్డీఏ అధికారులతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఆయన చెప్పిన దానికి అధికారులు నిరాకరించడంతో కోపంతో ఆయన బల్లను తోసేసారు. ఆయన అనుచరులు కుర్చీలను విరగ్గొట్టారు. వెంటనే పోలీసులు రంగంప్రవేశం చేసి ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.